Annapooranireview: (“అన్నపూర్ణి — ఇది మరొక సాఫ్టు ఇస్లాం జిహాదీ (లేక ఇస్లాం-కమ్యూనిస్టుల) ఎజెండాతో కూడిన సినిమా. పొరపాటున చూసాను”)
అవధానుల శ్రీనివాస శాస్త్రి: ఈ సినిమా, శాకాహారము ఐనా మాంసాహారము ఐనా అన్నం పరంబ్రహ్మస్వరూపమే అన్న కాన్సెప్టుతో చాలా కన్వెన్సింగుగా మెల్లమెల్లగా మొదలవుతుంది. రాముడు, కార్తికేయుడు, శివుడు మాంసాహారాన్నే ప్రోత్సహించారని ఒక ముస్లిముతో (అంటే విశాలధృక్పదం కలవారు అన్న మాట) పలికిస్తుంది. కేవలం శాకాహారమే వండితే ఏ హోటలులో ఉద్యోగాలు కూడా దొరకవు అనే కనువిప్పును కలిగిస్తుంది. క్లుప్తంగా శాకాహారము తినడం అంటే అది ఒక సంకుచిత మనస్తత్వం మాత్రమే అని హిందువులకు జ్ఞానబోధ చేస్తుంది. (ముస్లిములకు ఎటువంటి బోధన అవసరం లేదు కదా).
ఇలా, చివరికి భోజనం అంటే మాంసము మాత్రమే అన్న ఆలోచనను మెల్లమెల్లగా మనలో ప్రవేశపెడుతుంది. శాకాహార బ్రాహ్మణ కుటుంబాలను పరమ సంకుచితస్వభావులుగా, వెనుకబాటుతనముగా, చవకబారుగా ముద్రించి చూపిస్తుంది. చిట్టచివరిలో ఒక మంచి వంటమనిషిగా గుర్తించబడాలంటే సంకుచితంగా హిందూ పూజలను చెయ్యకూడదు, నమాజునే తప్పని సరిగా చెయ్యాలి అని చెప్పి, అదే “బ్రాడ్ మైండెడునెస్” అని హీరోయిన్ ద్వారా ఋజువుచేస్తుంది. బ్రాహ్మణ సమాజం అంతా ఈ విషయం తెలుసుకుని, తలవంచుకుని సిగ్గుపడుతుంది కూడా.
సమాజంలోని సద్బ్రాహ్మణులంతా శాకాహారము అనే మూఢనమ్మకాన్ని వదిలి మాంసాహారులై నమాజు చేస్తే అల్లా సంతోషిస్తాడనీ, అలా అందరూ హిందూ ఛాందసాలను వీడి ఇస్లాం అనే విశాలధృక్పదాన్ని అలవరచుకోవాలని మెల్లమెల్లగా ఎక్కిస్తుంది.
PS: ఒక బ్రాహ్మణుడుని మతమార్పిడి చేస్తే, మిగితా హిందువులంతా గొర్రెలనీ, వారిని మార్చడం చాలా తేలిక అనీ ఈ జిహాదీల నమ్మకం.