శ్రీరాముడిపై NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు! ఆపై క్షమించమని వేడుకోలు!

Controversynews: హిందువుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శ్రీరాముడు శాఖాహారి కాదని..ఆయన వేటాడి  మాంసాన్ని తినేవారని  వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోదండ రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ.. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ.. కానీ, రాముడు మాంసాహారిని అన్నారు.అంతేకాక  14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్‌ కోసం ఎక్కడికి వెళ్తాడు? అవునా..? కాదా..? తాను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానంటూ అవద్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మరోవైపు అవద్‌పై వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంస్థలు, పలువురు ప్రముఖులు, రామ భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.కొవ్వుతో మదమెక్కి అహంకారంగా మాట్లాడిన అవద్ తక్షణమే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో దిగివచ్చిన అవద్‌ క్షమాపణలు కోరారు. ఏ విషయం గురించీ తాను తొందరపడి మాట్లాడనని, రామాయణంలో ఉన్నదే చెప్పానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు.

 

Optimized by Optimole