(శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్): ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టుగా మారుతున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటున్నా వారి పల్స్ మాత్రం పసిగట్టలేక పోతున్నారు. అభివృద్ధి పేరుతో జగన్ … వైసీపీ అరాచకం పెరిగిందని బాబు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ మాత్రం రివర్సులో వినిపిస్తోంది. చెప్పుకోవడానికి సీఎం మా చుట్టం అయినా అపాయింట్మెంట్ ఇవ్వడు అని కొందరు .. బాబుని కాదని జగన్ను సీఎం చేస్తే ఏపీలో డెవలప్మెంట్ అంతంత మాత్రమే అని ఓటర్ల మాట. జగన్ కోటరీలో చుట్టూ ఉన్న కొంతమంది మాత్రమే ఆయనను కలవగలుగుతారు తప్ప ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా కలిసే అవకాశం లేదని టాక్ . పేదల కోసం నా చివరి రక్తపు బొట్టుని కూడా త్యాగం చేస్తానని చెప్పిన జగన్ కరకట్ట లో నిర్మించిన ఇంటి చుట్టూ పేదల గుడిసెలను చూడలేకపోయాడని … ఐదు రూపాయలకే పేదల కడుపు నింపే అన్న క్యాటిన్లను తొలగింపు మరో తప్పిదంగా చర్చ నడుస్తోంది. పార్టీలో కనీసం మర్యాద లేదు అని అసహనంతో దూరం ఉంటున్నారు చాలా మంది వైసీపీ ముఖ్య నేతలు. బాబుని జైలుకి పంపడం జగన్ పెద్ద విజయంగా భావిస్తే .. గ్రౌండ్ లెవల్లో మాత్రం చంద్రబాబుకు సింపతీ తెచ్చింది. అభ్యర్థుల మార్పుతో పెద్దగా ప్రయోజనం లేదు అనేది ప్రజల్లో చర్చ. ఇదంతా చూస్తుంటే నాయకులకంటే సీఎంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజినిని గుంటూరు – 2 కి, చిలకలూరులో రాజేష్ ని అభ్యర్థిగా పెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ అమరావతి నినాదం బలంగా ఉంటుంది ఈసారి. టీడీపీకి జనసేన తోడు బాబుకు ప్లస్ అయితే షర్మిల తో జగన్ కి నష్టం తప్పేలా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం లేకపోయినా వైసీపీ ఓట్లు గండి కొట్టడంలో కీలక పాత్ర వహిస్తుంది. గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన షర్మిల ఆ పరిచయాలను ఉపయోగించుకుంటుంది.
వైసీపీ పరిస్థితి ఏంటి ?
టౌన్స్( పట్టణాల్లో )లో వీక్ గా ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లో కొంత పాజిటివ్ గా ఉంది. చదువుకున్న నేటి యువత కూడ కుల పిచ్చిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అది కూడా చంద్రబాబుకే ప్లేస్ అవుతుంది. అమరావతి చుట్టుపక్కల దాదాపు 10 జిల్లాల్లో టీడీపీ కి మంచి మెజారిటీ ఉంటుందని సమాచారం. *_జగన్ ప్రభుత్వం పై మాకు నమ్మకం పోయింది … బటన్ నొక్కుకుంటూ వెళ్ళాడు తప్ప .. అని కామన్ పీపుల్ మాట్లాడుకుంటున్న మాటలు_* రోడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం వేసినవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఆశించినంత స్థాయిలో లేదు అనేది ప్రజల మాట
ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఓటర్లలో అసంతృప్తి !
ఉద్యోగులు జీతాలు టైమ్ కి అందవు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉన్నంతస్థాయి ఉద్యోగులు, హైదరాబాద్ లో కుటుంబం ఉంటూ తిరిగే వారి పై ప్రజల్లో కోపం ఉంది. ఎక్కువ శాతం హైదరాబాద్ లో వాళ్ళ కుటుంబాలు ఉండడం తో వారంలో సరిగ్గా 4 రోజులు కూడ డ్యూటీ చేయరు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ నుండి హైదరాబాద్ కి … తిరిగి సోమవారం నెమ్మదిగా ఏపీ కి వెళ్తారు అనేది పెద్ద చర్చ. మరోవైపు ఏపీ ప్రజల్లో కొత్త ఇండస్ట్రీల ఏర్పాటు లేదు … ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి రావలసిన స్పెషల్ స్టేటస్ విషయంలో కొట్లాడే ధైర్యం జగన్ లో లేదు అనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. ప్రతి నియోజకవర్గం లో దొంగ ఓట్లు చేర్చారు అనే ఆరోపణలు, సెంట్రల్ సపోర్ట్ తో పాటు వాలంటరీ వ్యవస్థ కీ రోల్ … డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయొచ్చు అనేది ప్లాన్ గా పెట్టుకున్నట్లు చర్చ. ఎన్నికల సమయంలో అధికారంలో ఎవరు ఉంటే వారికి కొంత అధికార యంత్రాంగం సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ” ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి , పెన్షన్ టైమ్ కి ఇస్తారు అనేది జగన్ కి పాజిటివ్ గా చెప్పే అంశాలుకానీ యువతకు ఉపాధి అవకాశలు లేవు”
నోట్ :- ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రస్తుత రాజకీయం మాత్రమే .. మునుముందు పాలిటిక్స్ లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.