Nikhil Siddharth:
కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్ అప్పుడు ఇప్పుడో ఎప్పుడో అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..!
కథ:
కథలోకి వస్తే.. రిషి ( నిఖిల్ సిద్ధార్థ్)కి రేసర్ కావాలనే కల. ఇందుకోసం శిక్షణ తీసుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. అక్కడే పరిచయమైన తార ( రుక్మిణి వసంత్) పై మనసు పారేసుకుంటాడు. ప్రేమ వర్కౌట్ కాకపోవడంతో లండన్ కి వెళ్ళిపోతాడు. రేసింగ్ ట్రైనింగ్ తీసుకుంటేనే పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తులసి అలియాస్ చుంబన ( దివ్యాంశ కౌశిక్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళుతుంది. ఇంతలో తులసి మాయం అవుతుంది. అసలు తులసి ఎవరూ? ఆమెను వెతికే క్రమంలో రిషికి ఎదురైనా అనుభవాలు ఏంటి? హైదరాబాద్ లో రిషి ప్రేమించిన తార లండన్ కి ఎందుకు వస్తుంది? వీరికి లోకల్ డాన్ బద్రి నారాయణ ( జాన్ విజయన్)కి సంబంధం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..?
ఎలా ఉందంటే..?
సుధీర్ వర్మ – నిఖిల్ కాంబినేషన్లో వచ్చిన స్వామి రారా సుపర్ హిట్ గా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలయికలో ” అప్పుడు ఇప్పుడో ఎప్పుడో ” తెరకెక్కింది. ఈ మూవీ విషయానికొస్తే .. ఫస్ట్ ఆఫ్ పరంగా సోసోగా అనిపిస్తుంది.ఇంటర్వెల్ వరకు సన్నివేశాలు అంతగా ఆసక్తికరంగా అనిపించవు. కథనం పరంగా నిఖిల్ గత సినిమాలకు.. ఈ మూవీకి పొంతనే లేదు. సెకండాఫ్ పరంగా పర్వాలేదు. ట్విస్టులు, కామెడీ కొంత రిలీఫ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకే అని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే..?
ఎప్పటిలానే నిఖిల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిరోయిన్ రుక్మిణి వసంత్ కి టాలీవుడ్ డెబ్యూ మూవీ.అందం అభినయం పరంగా ఆకట్టుకుంది. మరో హిరోయిన్ దివ్యాంశ కౌశిక్ ప్రాధాన్యమున్న పాత్రలు నటించింది. నటన పరంగా మెప్పించింది. వైవా హర్ష కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు ఇప్పుడో ఎప్పుడో రోటీన్ రొట్టె కొట్టుడు..!
రివ్యూ : 2.5/5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)