ప‌ఠాన్ క‌లెక్ష‌న్లు నిజ‌మా? ఫేకా?

బాలీవుడ్ బ‌డా మూవీ ప‌ఠాన్ క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట్లో తెగ చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈమార్కును తప్పుబడుతున్నారు నెటిజ‌న్స్‌. బాయ్ కాట్ ఎఫెక్ట్ సినిమాపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని.. త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్టినంత మాత్రాన వాస్త‌వాలను దాచ‌లేర‌ని సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌ఠాన్ మూవీకి..మొద‌టివారం మిక్స్ డ్ టాక్ వినిపించింది. బాలీవుడ్ క్రిటిక్స్ మిన‌హా .. మిగ‌తా ఇండ‌స్ట్రీ సినీ విశ్లేష‌కులు సినిమా యావ‌రేజ్ గా తేల్చేశారు. టాలీవుడ్,కోలీవుడ్ లాంటి ఇండ‌స్ట్రీలో చిత్రయూనిట్‌ ప్ర‌మోష‌న్స్ చేసిన పాపానపోలేదన్న‌ది నెటిజ‌న్స్ వాద‌న . ఒక్క బాలీవుడ్ లోనే క‌లెక్ష‌న్లు వ‌చ్చినంత మాత్రానా.. అన్ని కోట్లు రాబ‌ట్టిందనేది త‌ప్పుడు లెక్క‌గా కొట్టిపారేస్తున్నారు. బాయ్ కాట్ దెబ్బ‌తో మ‌స‌క‌బారిన బాలీవుడ్ ఇండ‌స్ట్రీని కాపాడుకునేందుకే మ‌సిపూసి మారెడు కాయ లెక్క‌లు చెబుతున్నార‌ని నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక ప‌ఠాన్ చిత్రాన్ని సినిమా స్టార్టింగ్ నుంచి అనేక వివాదాలు వెంటాడాయి. ఓవ‌ర్గం అయితే బాయ్ కాట్ చేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టింది. సోష‌ల్ మీడియాలోను సినిమా బాయ్ కాట్ చేయాల‌ని నెటిజ‌న్స్ విప‌రీతంగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ గ‌తంలో చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని.. ట్రోల‌ర్స్‌ బూతుల‌తో రెచ్చిపోయారు. సినిమా ప్ర‌మోష‌న్ సాంగ్ లో ఓవ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా న‌టి దీపికా ప‌దుకుణే వేసుకున్న డ్రెస్ పై ఓ మంత్రి బ‌హిరంగంగానే నిర్మాత‌ల‌ను హెచ్చ‌రించారు.

మొత్తంగా ప‌ఠాన్ చిత్ర‌యూనిట్‌ కలెక్ష‌న్ల విష‌యంలో నెటిజ‌న్స్ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ చేయ‌క‌పోవ‌డం మ‌రో చ‌ర్చ‌కు తావిచ్చిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికైనా నెటిజ‌న్స్ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తుందో లేదో వేచిచూడాలి!