మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను…
ఆగస్టు పదిహేను అర్ద రాత్రి స్వతంత్రం….
తెలంగాణ లో దిగులు మంత్రం..
దేశమంతా ఎగిరిన జాతీయ పతాకం…..
హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి||
నైజామ్ పాలనలో..
దేశముఖుల ఆగడాలు
భూస్వాముల…పెత్తందార్ల
దోపిడీలు, దురంతాలు
సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి||
పోరుచేయనిదే భుక్తి లేదని
తిరుగబడ్డ పోరుబిడ్డ
దొడ్డి కొమురయ్య అమరత్వం…
మా పంటలు మాకేనని
గోసి సెక్కి కాశబోషి
కారం పొడి బొడ్లో దోపుకొని
రోకలి బండ చేతబట్టి
ఆడది అబల కాదు సబలని
స్పూర్తి నింపిన అయిలక్క
వీరోచిత పోరాటం…|| మర్చి||
ఖాశీమ్ రజ్వీ ముష్కరులు
ఊళ్ల పైబడి ఆలు, చూలాలు, పిల్ల తల్లుల
చెరబట్టిన ఆగాడాలు….||మర్చి||
పాలమూరు, ఇందూరు
ఏకశిలానగరం, కంభమ్మెట్టు నాటి నీలగిరి
నేటి నల్గొండ జిల్లాలో
భూమి, భుక్తి, విముక్తి కోసం
సాగిన సాయుధ తెలంగాణ ఉద్యమాలు….||మర్చి||
బండెనుక బండి కట్టి….
చుట్టు ముట్టు సూర్యాపేట…
కలాలు గళాలు వినిపించిన ఆ పాటల
తిరుగుబావుటా…. ||మర్చి||
గుండ్రాంపల్లి, బాలెంల
పాతసూర్యపేట ఇస్తాల పురం … ఒక్కటా
రెండా ఎన్నో క్యాంపులతో
తిరుగు బాటు చేసిన….
భీమిరెడ్డి, ధర్మభిక్షం..ఆరుట్ల ,రావి
కాళోజి, దాశరధి మాటల
తూటాల విప్లవం..
మనతెలంగాణ ఉద్యమం…… ||మర్చి||
డిల్లీ గద్దెల మీది గద్దల
ఊక దంపుడు ఉపన్యాసాలు కాదు…
నాడు…
నేడు…
రేపు…
ప్రపంచంలో ఎక్కడ లేని
భూ పోరాటం…
భుక్తి ఆరాటం…
విముక్తి కెరటం…
సువరణాక్షర లిఖితం
తెలంగాణ విముక్తి, విమోచన వజ్రోత్సవ
దినోత్సవం…..
గునగంటి వెంకటేశ్వర్లు
ఆత్మకూరు.ఎస్
సూర్యాపేట