అస్సాంలో జనాభా నియంత్రణ చట్టం..?

జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్​ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం ఇదే తంతును కొనసాగిస్తూ.. బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పాపులేషన్ ఆర్మీ’ పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాంతాల్లో నివసిస్తున్న మైనారిటీల జనాభా వృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇటీవలే ఓ కార్యక్రమంలో జనాభా నియంత్రణపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే శెర్మాన్​ అలీ అహ్మద్​ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ..
” రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు సుమారు 1,000 మంది యువతతో పాపులేషన్​ ఆర్మీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. దాంతో పాటుగా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఏఎస్​హెచ్​ఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీరు జనాభా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించటం, మహిళలకు గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేస్తారు. అలాగే.. అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 20కి పెంచాలనే డిమాండ్​ను ప్రభుత్వం పరిశీలిస్తోందని అసోం ముఖ్యమంత్రి సమాధామిచ్చారు.
కాగా సీఎం మాటలకు అలీ జవాబిస్తూ.. నదీ పరివాహక ప్రాంతాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, కొన్ని జిల్లాల్లో బాల్యవివాహాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపైనా దృష్టి సారించాలని కోరారు అ. కాంగ్రెస్​ నేత అడిగిన ప్రశ్నలకు.. జనాభా నియంత్రణ విధానం అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదని, పేదరికానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు సీఎం హిమంత్ బిశ్వ.