అందం అభినయం చిలిపితనం కలగలిపిన హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొంచే పేరు సాయిపల్లవి. తన నటనతో కాక యాటిడ్యుత్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫిదా బ్యూటీ తాజాగా నటించిన చిత్రం విరాటపర్వం. ఇప్పటికే విడుదలైన మూవీట్రైలర్ కి విశేష స్పందన లభించింది. ఈమూవీ విడుదల నేపథ్యంలో ఫ్రీరీలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈవెంటెలో భాగంగా సాయిపల్లవిని ఏవీని లేడి పవర్ స్టార్ అంటూ ప్లే చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది.
ఇక సాయి పల్లవి సైతం తెరపై లేడి పవర్ స్టార్ బిరుదు చూడగానే ఒక్కింత ఆశ్చర్యనాకి గురయ్యింది. అభిమానుల సంగతి చెప్పనక్కర్లలేదు. ఆటైటిల్ చూడగానే అభిమానులు కూర్చున్న చోటు నుంచి లేచినిలబడి లేడి పవర్‌స్టార్ అంటూ అరుపులు కేకలతో ఈవెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
కాగా ఇటీవల ఓ ఫంక్షన్లో క్రియెటివ్ డైరక్టర్ సుకుమార్ స్టేజిపైనే లేడి పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే . అప్పటినుంచి ఆమె అభిమానులతో పాటు అందరూ
సాయిపల్లవిని అలా పిలవడం పరిపాటిగా మారింది.
సాయిపల్లవి , రానా నటించిన విరాటపర్వం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎక్కడ చూసిన చిత్రానికి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని స్పీడప్ చేసింది.