ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా
లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ (27) వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు సాధించింది. ఆ జట్టులో బట్లర్ (39) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో మెరవగా.. సాయికిశోర్ రెండు, రషీద్‌ఖాన్, యశ్ దయాళ్, షమి తలా వికెట్ పడగొట్టారు.
అనంతరం 131 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించి టోర్నీ విజేతగా అవతరించింది. ఆ జట్టు బ్యాటర్లలో శుభమన్ గిల్ (45*; 43 బంతుల్లో ).. కెప్టెన్ హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్ (32*) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.