ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్‌నవూ బౌలర్లలో మెహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్య, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ సూపర్జజెయింట్స్..కెప్టెన్ కేఎల్ రాహుల్ (79), దీపక్ హుడా (45) రాణించినా.. మిగతా బ్యాటర్స్ విఫలమవడంతో ఓటమిపాలైంది . ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, సిరాజ్, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.