సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ. 100 కోట్ల షేర్ అందుకున్న నాల్గో సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డులకు ఎక్కింది.
ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రూ. 105.69 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..మరో రూ. 15.31 కలెక్షన్లు రాబట్టాలి.
పరశరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. థమన్ సంగీతాన్ని అందిచారు. జీఎంబి , మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.