ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘనవిజయం సాధించింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్ (53 బంతుల్లో 86) అదరగొట్టగా.. కెప్టెన్ సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్తాన్ భారీ స్కోరును సాధించింది.
ఇక189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ను డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; ) సూపర్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో.. మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ను ఫైనల్స్ లో నిలిపాడు. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు.