ఆనంద్ దేవరకొండ ‘బేబి ‘ మూవీ రివ్యూ రేటింగ్..

Babymoviereview: ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య కథానాయిక. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కెఎన్ నిర్మాత. టీజర్, టైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం!

కథ: ఆనంద్( ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న బస్తీలో నివసిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే   తన ఎదురింట్లో ఉండే వైషు అలియాస్ వైష్ణవి ( వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంటాడు.  అయితే ఆనంద్ పదో తరగతిలో ఫెయిల్ అవడంతో ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ లో చేరుతుంది. ఆమెకు కాలేజిలో విరాట్ ( విరాజ్ అశ్విన్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆనంద్ _ వైషూ ప్రేమ కథలో అనేక ట్విస్ట్లు చోటుచేసుకుంటాయి. ఇంతకు ఆనంద్ ప్రేమలో గెలిచాడా? వైషూ జీవితంలో విరాజ్ పాత్ర ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే?

ఎలా ఉందంటే: సినిమా కథ విషయానికొస్తే… తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. ఎదిగే క్రమంలో ప్రేమలో అనూహ్య మలుపులు చోటు చేసుకోవడం. చివరకి ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా? లేక కంచికి చేరిందా? అన్నది సారాంశంగా సినిమాను తెరకెక్కించారు. చాలా మంది జీవితాల్లో ఇలాంటి సున్నిత ప్రేమ కథలు కనిపిస్తుంటాయి. అలాంటి కథను బెస్ చేసుకొని  చిత్ర యూనిట్ బేబి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ చిత్రం యువతకు ముఖ్యంగా అబ్బాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది. అమ్మాయిలకు అంతంగా నచ్చకపోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని  సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్  ఎమోషనల్ సీన్స్ భావోద్వేగభరితంగా ఉంటాయి. 

ఎవరెలా చేశారంటే?

హీరో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ పరంగా ఉన్నంతలో ఫర్వాలేదని చెప్పవచ్చు. హీరోయిన్ వైష్ణవి రెండు పాత్రల్లో చక్కగా నటించి మెప్పించింది. ఎమోషన్స్ సీన్స్ లో అనుభవం ఉన్న నటిలా నటన కనబరిచింది. ముఖ్య పాత్రలో నటించిన విరాజ్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు సాయి రాజేష్ తను చెప్పాలనుకున్న కథను తెరపై ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది ” సంభాషణ సినిమా ఏంటో చెప్పకనే చెబుతుంది. నేపథ్య సంగీతం ,పాటలు సినిమాకు మేజర్ ఎసెట్. సినిమాటోగ్రఫీ అద్భుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

“ఒక్క మాటలో గుండెల్ని పిండేసే ముక్కొణపు ప్రేమ కథ”

రివ్యూ రేటింగ్: 3/5

Optimized by Optimole