భలేగుంది బాల!

సినిమా : శ్రీకారం గానం : పెంచల దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎధాన దాని ఎధాన
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే
వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద హ్హా, కట్టమింద భలే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎధాన దాని ఎధాన
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే….. నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో…. వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
అలసందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా
అలసందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా

వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓఓ
వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా….. ఏ బాలా
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే…… సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
కారమైన, ముది కారామైన…
ముది కారమైన మూతి ఇరుపులు భలేగున్నయే బాలా
నీ అలక తీరనూ ఏమి భరణము ఇవ్వగలను భామ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ……
ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోటా
ఎన్నేలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోటా
నువ్వు పక్కనుంటే నువ్వు పక్కానుంటే
నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేర రావా
ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన