సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని ఆయన అన్నారు. కాగా నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి పనుల పూర్తి విషయమై.. ఆరేళ్ల కిందట ఇచ్చిన హామీ కేసీఆర్ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. త్వరలో డిండి ప్రాజెక్ట్ పూర్తవవుతుందన్న ముఖ్యమంత్రికి ,ఎగువున ఉన్న నక్కలగండి, శివన్న గూడెం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలన్నారు.

ఇక 2018లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని అన్న ముఖ్యమంత్రి ఏమోహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని సంజయ్ ఫైర్ అయ్యాడు. కేసీఆర్ చెప్పిన మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని , దుబ్బాక ఫలితం సాగర్లో పునారావృతం అవుతుందని సంజయ్ పేర్కొన్నారు.