పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో పార్టీనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ సోదరి పార్టీ గురించి స్పందిస్తూ.. పార్టీ పెట్టె విషయమై ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు.. పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడితే బాగుంటుందని.. పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ అంశం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్ రెడ్డి, విదేశాంగ సహాయ మంత్రి మురళిధరన్ కలిసి చర్చినట్లు జనసేన అధినేత తెలిపారు. కేంద్రం నుంచి ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.