విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా లైగర్ సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించి ప్రత్యేక సెట్ రూపొందించినట్లు సమాచారం. దర్శకుడు పురిజగన్నాద్కెకి మూడో హిందీ చిత్రం, హీరో విజయ్ కి మొదటి చిత్రం కావడం విశేషం. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరి నెక్స్ట్ సినిమా కావడంతో అభిమానులు ఆసక్తి నెలకొంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *