ఆదివాసీ గిరిజనులు కోసం కరసేవ ప్రారంభం: బండి సంజయ్

తెలంగాణలో పొడుభూములు,అదివాసులు, గిరిజనులు కోసం భాజపా యుద్ధం మొదలెట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంబోడు తండాలో సభలో ఆయన మాట్లాడుతూ.. నాడు అయోధ్యలో రామాలయం కోసం కరసేవ చేశామని నేడు పేదల కోసం గుర్రంబోడు తండా నుంచి కరసేవ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి, వారిమీద అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. గిరిజన బిడ్డలు జోలికొస్తే టీఆర్ఎస్ నేతల కాళ్లకు రివిట్లు ఎక్కించాల్సి వస్తుందని సంజయ్ హెచ్చరించారు.

కాగా స్థానిక అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి , ఆయన బినామీలు గుండాగిరితో గిరిజన భూమలు లాక్కొని ,అక్రమ కేసులు బనాఇస్తున్నారని భాజపా అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. ఆ ఎమ్మెల్యేని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. మరో పదేళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు.

తండా భూముల వివాదం ఏంటి..?

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూమి కోల్పోయిన అప్పటి ప్రభుత్వం 1,874 ఎకరాలు కేటాయించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆభూముల్లో 500 ఎకరాలను అధికార పార్టీ నేతలు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైతుల ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ ఇద్దరు తహశీల్దార్ లను సస్పెండ్ చేశారు. భూములకి సంబంధించి ఎటువంటి వివరాలను అధికారులు బయటపెట్టకపోవడంతో రైతుల బండి సంజయ్ ని ఆశ్రయించారు.

Optimized by Optimole