నటుడు సూర్యకు కరోనా పాజిటివ్!

తమిళ అగ్ర నటుడు సూర్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా బయటపడలేదని , అందరూ జాగ్రత్తగా ఉండాలి, నాకు చికిత్స చేస్తున్న వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సూర్య ట్వీట్ చేశారు.                      లాక్ డౌన్ తరవాత ఇప్పుడిప్పుడే సినిమా రంగం కోలుకుంటున్న తరుణంలో సూర్య కరోనా బారిన పడడంతో ఇండస్ట్రీ అలెర్ట్ అయ్యింది. వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన నిర్లక్ష్యం పనికిరాదని అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సినిపెద్దలు సూచిస్తున్నారు. కాగా ఇటీవలే  సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం పలు విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.