- నిబంధనల పేరుతో చార్జీల బాదుడు
బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వీలుండగా , ఇప్పుడు వెసులుబాటును మూడింటికి తగ్గించడం గమనార్హం. కాగా బ్యాంకుల నగదు డిపాజిట్లపై వసూల విషయం ఖాతాదారులకు తెలియడం లేదు. ఈ విషయం బ్యాంకు అధికారులు డిపాజిట్ దారులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.