అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు.

కాగా ఈ బీటింగ్​ రీట్రీట్​ కార్యక్రమాన్ని సాంకేతికతతో మరింత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావించింది. అందుకే 1000 డ్రోన్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 10 నిమిషాల పాటు సాగిన ఈ షోలో 75 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన నిర్వహించారు. అటు నార్త్​.. సౌత్​ బ్లాక్స్​ వద్ద 3-4 నిమిషాల పాటు కళ్లు చెదిరే లేజర్​ షో నిర్వహించారు.దీంతో రాజ్​పథ్​ రంగురంగుల విద్యుత్​ కాంతులతో వెలుగులీనింది.ఈ కార్యక్రమం కోసం విజయ్​ చౌక్​లో ఆంక్షలను అమలు చేశారు అధికారులు.

Optimized by Optimole