అపర కుబేరుడు , వ్యాపార వేత్త బిల్ గేట్స్ రెజ్యూమ్ ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. 48 ఏళ్ల క్రితం నాటి రెజ్యూమ్ నూ ఆయన లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.అయితే అందులో కొన్నింటిని సరిచేస్తే బాగుుంటదని ఆయన అభిప్రాయపడగా.. ఇందులో ఎలాంటి దోషాలు లేవు గ్రేట్ రేజ్యూమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువకుల్లో స్పూర్తి నింపేందుకు ఆయన ఎల్లవేళలా కృషిచేస్తున్నారంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక రెజ్యూమ్ ని అప్ లేడ్ చేస్తూ బిల్ గేట్స్ సరదా వ్యాఖ్యల చేశారు. ‘ విద్యాభ్యాసం పూర్తి చేసినవారు.. చదువు మధ్యలో మానేసినవారి కోసం.. 48 ఏళ్ల క్రితం రెజ్యూమ్ పోస్ట్ చేస్తున్న.. నాకంటే మీరందరి రేజ్యూమ్ బెటర్ గా ఉంటుందని భావిస్తున్నని ఆయన పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హార్వర్డ్ యూనివర్శిటిలో చదువుతుండగా .. ఆయన ఈ రెజ్యూమ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో వర్క్స్ ఎక్స్ పిరయన్స్, తనకు వచ్చిన భాషలు, తను వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీల వివరాలను తెలుపుతూ రెజ్యూమ్ ప్రిపేర్ చేసినట్లు బిల్ గేట్స్ రాసుకొచ్చాడు.