ఓ మహిళ గోడపై ఆవు పిడకలు కొట్టే వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గామారింది. గోడపై ఆవు పిడకలను ఖచ్చితమైన ప్రదేశంలో విసరడాన్ని చూసి ఆమె ప్రతిభ ఆమోఘమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన IAS అధికారి అవనీష్ శరణ్ సైతం.. ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. ఇండియన్ బాస్కెట్ బాల్ టీం ఆమె కోసం వెతుకుతుంది అంటూ క్యాప్షన్ జత చేశారు.
Indian basket ball team is searching for her. pic.twitter.com/hE2dBy7nAu
— Awanish Sharan (@AwanishSharan) June 29, 2022
వండర్ ఉమెన్..
ఇక వీడియోని గమనించినట్లయితే.. సదరు మహిళ పిడకలను చేత్తో విసిరనప్పడు.. గోడపై నిలువు వరుస క్రమంలో ఏర్పడటం చూసి నెటిజన్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.ఆమె ప్రతిభని కనిపెట్టడం అవసరమని ఓ వినియోగదారుడు కామెంట్ చేయగా.. మరోక నెటిజన్.. వండర్ ఉమెన్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.
గోరెహబ్బ పండగ..
ఇక ఆవు పిడకలతో కర్ణాటకలోని ఓ గ్రామంలో గోరెహబ్బ అనే పండుగను జరుపుకుంటారు. దీపావళి పండగ ముగింపు రొజు ఈపండగను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఒకరిపై మరోకరు పిడకలను విసురుకుంటూ ఆనందోత్సహాల మధ్య జనం గోరెహబ్బ జరుపుకోవడం విశేషంగా చెప్పవచ్చు.