సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించిన మహిళ నేత. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు.. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులకు దడపుట్టించే ఫైర్ బ్రాండ్. తెలంగాణ యువత బలిదానాలపై పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో ప్రసగించిన గొప్ప మానవతవాది . రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. తెలంగాణ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని అప్యాయంగా కోరుతూ సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
హర్యానా రాష్ర్టంలోని కంబోలా సుష్మాస్వరాజ్ స్వస్థలం. 1952, ఫిబ్రవరి 14న ఆమె జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆమె విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది.పాఠశాల, కళాశాలలో ఉత్తమ విద్యార్థినిగా పేరుతో పాటు..రాజనీతి సంస్కృతంలో బి.ఎ.పూర్తి చేసి..పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్రంలో పట్టభద్రులైనారు.
సుష్మ స్వరాజ్ విద్యార్థి దశలోనే ఏబీవీపీ నాయకురాలిగా రాజకీయా ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1975 లో తన సహచర న్యాయవాది స్వరాజ్ కౌశల్ తో వివాహం జరిగింది.
1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ..ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. వాజ్పయ్ మంత్రివర్గంలో 2000 నుంచి 2003 వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.2004లో ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.2014 ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆరోగ్య రీత్యా 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
తెలంగాణ చిన్నమ్మా..
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర మరువలేనిది.పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు.బిల్లు పాస్ అనంతరం ప్రసంగిస్తూ ‘తెలంగాణ చిన్నమగా గుర్తుపెట్టుకోవలని తెలంగాణ ప్రజలను ప్రేమతో కోరారు’
రాజకీయాలకు అతీతంగా ఎందరో మనసులను గెలుచుకొని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఐరన్ లేడి ‘సుష్మాస్వరాజ్’ భౌతికంగా దూరమై మూడేళ్లు కావొస్తున్న ఆమె స్మృతులు మాత్రం చిరస్మరణీయం.