ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటే సీనియర్ నేతలు వారించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రేవంత్ అనుచరవర్గంతో కావాలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు ఆయువు పట్టుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ నుంచి వెళితే తీవ్ర నష్టమని నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. ఈక్రమంలోనే రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లారు. వెంకట్ రెడ్డి సైతం పార్టీ వీడుతారని ప్రచారం జరిగినా.. తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని.. వెళ్తే చెప్పే వెళ్తానని.. దేనికి భయపడే వ్యక్తి కాదని తేల్చిచెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు వెంకట్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషిస్తూ.. పొమ్మనకుండా పొగబెట్టడం మాదిరి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 34 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని.. ఇలా అవమానిస్తారంటూ మండిపడుతున్నారు. సీనియర్ నేత దామెదర్ రెడ్డి తన అనుచరవర్గంతో దాడిచేస్తే ఆయనను ఆయననూ ఆకాశానికెత్తిసి .. ..తమ నేతను అవమానించడంపై రగిలిపోతున్నారు. అంటూ తుంగతుర్తి నియోజకవర్గ అభిమానులు సైతం దయాకర్ కూ గట్టి బుద్ది చెప్తామని అల్టిమేటం జారిచేశారు.
ఇక దయాకర్ వ్యాఖ్యలపై ఉమ్మడి నల్లగొండ కోమటిరెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చిపోతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పెట్టుకోవడం అంటే కొరివితో తల గొక్కొడమని.. రేవంత్ కూ బానిసలా వ్యవహరిస్తున్నావు దయాకర్ కాచుకో అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఉప ఎన్నికలో తమ సత్తా ఏంటో చూపిస్తామని అభిమానులు సవాల్ విసురుతున్నారు.