దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు.
కాగా చౌటుప్పల్ మండలంలో బీజేపీ నేతల ప్రచారంతో పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. ఎక్కడ చూసినా నేతలు కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం చేయడం కన్పించింది. భారీ ఎత్తున బండి సంజయ్ వెంట పార్టీ కార్యకర్తలు నడుస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చూసి ఓటర్లు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దీపావళి రోజున బీజేపీ అగ్ర నేతలంతా కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల స్ట్రాటజీ కి పెట్టింది పేరైన కమలం పార్టీ వ్యూహాలను చూసి కంగుతినడం ప్రతి పక్ష నేతల వంతైంది. కాగా ఈ ప్రచారంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఇంఛార్జ్ జి.వివేక్ వెంకటస్వామిసహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు కమలం పూలు చేత బట్టి ప్రచారం నిర్వచించడం కోసం మెరుపు.