కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలను పక్కా ఆధారాలతో  ప్ర‌జాకోర్టులో దోషిగా  నిల‌బెట్టెందుకు  కమలం పార్టీ ప‌క్క‌గా  ప్లాన్ చేస్తోంది.

ఇక ఇప్ప‌టికే బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు  బండిసంజ‌య్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో అనుమ‌తి ఇవ్వాల‌నికోరుతూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శికి లేఖ‌రాశారు. దానికి కొన‌సాగింపుగా బిజెపి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు గంగిడి మ‌నోహ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శికి ఆర్టీఐ ద్వారా ధ‌ర‌ఖాస్తు చేసి స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు.  దీన్ని బ‌ట్టి కాళేశ్వ‌రం అంశంలో బిజెపి నేతలు త‌గ్గేదే లే తరహల్ దూకుడు కొనసాగిస్తున్నారు.

ఆర్టీఐ ద్వారా గంగిడి కోరిన స‌మాచారం ఎక్స్క్లూజివ్ గా మీకోసం …

1.   కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకి అనుమతి ఇవ్వాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్‌కుమార్‌ మీకేమైనా లేఖ పంపారా? పంపితే ఆ లేఖ మీకెప్పుడు అందింది? దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 

2. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్‌కుమార్‌ రాసిన లేఖపై ప్రభుత్వపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?

3. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బిజెపి ప్రతినిధి బృందానికి అనుమతి మంజూరు చేయడంలో వున్న ఇబ్బందులు ఏమిటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?