దేశ రాజధాని ఢిల్లిలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ ఆవరణలో ఇటు అధికార ఆప్ ,ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటి నిరసనలతో డ్రామాను రక్తికట్టిస్తున్నారు. నేడు అసెంబ్లీలో సీఎం క్రేజివాల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాత్రంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు.
ఇక దేశవ్యాప్తంగా దుమారం రేపిన లిక్కర్ స్కాంపై LG సక్సేనా దర్యాప్తుకు ఆదేశించారని..ఆయనే అవినీతి పరుడంటూ ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రాజీనామా చేయాలని బీజేపీ నేతల కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
అటు సీఎం క్రేజివాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు . అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు గానూ. .ఆప్ 63 మంది సభ్యుల బలం ఉండటంతో విశ్వాస పరీక్షలో ఈజీగా గట్టేక్కుతామని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.