వినాయక వ్రత పూజ విధానం:

సిరి సంపదలు.. జ్ఞానం.. దీర్ఘాయువు..ఆరోగ్యం .. విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థి హిందువుల పవిత్ర పండగ. హిందు పంచాగ ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఈ చతుర్థి తిథిని కళంక చతుర్థి అని కూడా అంటారు. ఈపండుగను సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు.. మూడు రోజులు.. ఏడు రోజులు.. పది రోజులు.. పదమూడు రోజులు.. నెల రోజులు జరుపుకుంటారు.
హిందువులు ఏ కార్యక్రమాన్ని మొదలెట్టిన తొలి పూజ గణనాధునికే చేస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు ,ఆటంకాలు తొలగిపోయే కార్యనెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే కుల మతాలకు అతీతంగా వినాయక చతుర్థిని ఊరువాడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

వినాయక చవితి’ పండుగ రోజు పొద్దునే నిద్రలేచి నిత్య కాల కృత్యాలు తీర్చుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’

పూజాసామాగ్రి :
పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరిణలు, అగరుబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, దీపారాధన వస్తువులు, యథో చితంగా పత్రి , చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్రం. పత్తి (దూదిని) సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు రెండు చేసుకోవాలి. రూపాయి బిళ్ళ లంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి, నీటిని ఒత్తి పసుపు అద్దిన వస్త్రాలు 2, అగరుబత్తి పుల్లలకు దూదిని చుట్టి నేతిలో/ నూనెలో ముంచి పొడిగా ఉండేలా ఒత్తిన ‘కైవత్తులు’ 2 తయారు చేయాలి. 3 తమలపాకుల్లో రెండు వక్కలూ, 2 అరటిపళ్లు చొప్పున పెట్టి తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి.

అవసర నైవేద్యానికి:
చలిమిడితో చేసిన ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, పళ్ళు, కొబ్బరికాయ

మహానైవేద్యానికి:
అన్నం, పప్పు, పచ్చడి, కూర, పులుసు, వినాయకుడికి ఉండ్రా ళ్ళన్నా, జిల్లేడుకాయలు అన్నా, తెల్ల నువ్వులు కలిపి చేసిన మోదకాలన్నా చాలా ఇష్టం. ఇవి కాక, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యధాశక్తి ఎవరికి కలిగింది వాళ్లు పెట్టొచ్చు.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను.
ఏకవిశంతి పత్రములు –

పూజావిధానం :
ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

గణపతి పూజా ప్రారంభః 

కరిష్యే గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తానామిష్టవరదం సర్వమంగళకారణం ||

ధ్యానం –
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరందేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ||
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
శ్రీ మహాగణపతిం ధ్యాయామి |

ఆవాహనం –
అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర |
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణాసురపూజిత ||
శ్రీ మహాగణపతిం ఆవాహయామి |

ఆసనం –
అనేక రత్నఖచితం ముక్తామణి విభూషితం |
రత్న సింహాసనం చారు గణేశ ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం ఆసనం సమర్పయామి |

పాద్యం –
గౌరీపుత్ర నమస్తేఽస్తు దూర్వారపద్మాది సంయుతం |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణద్విరదానన ||
శ్రీ మహాగణపతిం పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
సిద్ధార్థ యవదూర్వాభిః గంధ పుష్పాక్షతైర్యుతం |
తిల పుష్ప సమాయుక్తం గృహణార్ఘ్యం గజాననా ||
శ్రీ మహాగణపతిం అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనం –
కర్పూరాగరు పుష్పైశ్చ వాసితం విమలం జలం |
భక్త్యాదత్తం మయాదేవ కురుష్వాచమనం ప్రభో ||
శ్రీ మహాగణపతిం ఆచమనం సమర్పయామి |

మధుపర్క స్నానం –
దధ్యాజ్య మధుసంయుక్తం మధుపర్కం మయాహృతం |
గృహాణ సర్వలోకేశ గజవక్త్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం మధుపర్క స్నానం సమర్పయామి |

పంచామృత స్నానం –
మధ్వాజ్య శర్కరాయుక్తం దధి క్షీర సమన్వితం |
పంచామృతం గృహాణేదం భక్తానామిష్టదాయకా ||
శ్రీ మహాగణపతిం పంచామృత స్నానం సమర్పయామి |

(యిచ్చట పాలు, పెరుగు, పండ్లరసము మున్నగు వానితో కూడ అభిషేకము శాస్త్రోక్త విధానముగా చేసికొనవచ్చును)

శుద్ధోదక స్నానం –
గంగాది పుణ్యపానీయైః గంధ పుష్పాక్షతైర్యుతైః |
స్నానం కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం శుద్ధోదక స్నానం సమర్పయామి |

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.

వస్త్రం 
రక్తవస్త్రద్వయం దేవరాజరాజాది పూజిత |
భక్త్యాదత్తం గృహాణేదం భగవాన్ హరనందన ||
శ్రీ మహాగణపతిం వస్త్రయుగ్మం సమర్పయామి | (ఎర్రని వస్త్రములు)

యజ్ఞోపవీతం 
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ చారు సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ మహాగణపతిం యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధము 
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం శ్రీగంధం సమర్పయామి |

అక్షతాన్ 
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయా తండులాన్ శుభాన్ |
హరిద్రాచూర్ణసంయుక్తాన్ సంగృహాణ గణాధిప ||
శ్రీ మహాగణపతిం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి 
సుగంధీని చ పుష్పాణి జాజీకుంద ముఖానిచ |
ఏక వింశతి సంఖ్యాణి గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథః అంగపూజా –
ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
ఓం మహత్తమాయ నమః | మేఢ్రం పూజయామి
ఓం నాధాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
ఓం స్కంధాగ్రజాయ నమః | స్కంధే పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ నమః | హస్తాన్ పూజయామి (చేతులను) |
ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
ఓం శూర్పకర్ణాయనమః | కర్ణే పూజయామి (చెవులను) |
ఓం ఫాలచంద్రాయనమః | ఫాలం పూజయామి (నుదురును) |
ఓం నాగాభరణాయనమః | నాశికాం పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠా పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |

ఏకవింశతి పత్ర పూజ – (౨౧ ఆకులు)
ఓం ఉమాపుత్రాయనమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయనమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయనమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (అనగా గరిక) |
ఓం ధూమకేతవే నమః | దుర్ధూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయనమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయనమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయనమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయనమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధురాయ నమః | సింధూర పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయనమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయనమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజ త్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

ఏకవింశతి పుష్ప పూజా – (౨౧ పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః | దుర్ధూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రదగణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్చిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం మూషికవాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |

అష్టోత్తర శతనామ పూజ 
ఓం గజాననాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్విముఖాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం కృత్తినే నమః |
ఓం సుప్రదీపాయ నమః | ౧౦
ఓం సుఖనిధయే నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం మంగళస్వరూపాయ నమః |
ఓం ప్రమదాయ నమః |
ఓం ప్రథమాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం విఘ్నకర్త్రే నమః |
ఓం విఘ్నహంత్రే నమః |
ఓం విశ్వనేత్రే నమః |
ఓం విరాట్పతయే నమః | ౨౦
ఓం శ్రీపతయే నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం అగ్రపూజ్యాయ నమః |
ఓం అగ్రగామినే నమః |
ఓం భక్తనిధయే నమః |
ఓం శృంగారిణే నమః | ౩౦
ఓం ఆశ్రితవత్సలాయ నమః |
ఓం మంత్రకృతే నమః |
ఓం చామీకరప్రభాయ నమః |
ఓం సర్వాయ నమః |
ఓం సర్వోపన్యాసాయ నమః |
ఓం సర్వకర్త్రే నమః |
ఓం సర్వనేత్రాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం సర్వసిద్ధయే నమః |
ఓం పంచహస్తాయ నమః | ౪౦
ఓం పార్వతీనందనాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం కుమారగురవే నమః |
ఓం సురారిఘ్నాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహాకాలాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం లంబజఠరాయ నమః | ౫౦
ఓం హ్రస్వగ్రీవాయ నమః |
ఓం మహేశాయ నమః |
ఓం దివ్యాంగాయ నమః |
ఓం మణికింకిణి మేఖలాయ నమః |
ఓం సమస్తదేవతామూర్తయే నమః |
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం కుంజరాసురభంజనాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం మహోదరాయ నమః |
ఓం మదోత్కటాయ నమః | ౬౦
ఓం మహావీరాయ నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం విష్ణుప్రియాయ నమః |
ఓం భక్తజీవితాయ నమః |
ఓం జితమన్మథాయ నమః |
ఓం ఐశ్వర్యకారణాయ నమః |
ఓం జయినే నమః |
ఓం యక్షకిన్నరసేవితాయ నమః |
ఓం గంగాసుతాయ నమః |
ఓం గణాధీశాయ నమః | ౭౦
ఓం గంభీరనినదాయ నమః |
ఓం వటవే నమః |
ఓం అభీష్టవరదాయ నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం శివప్రియాయ నమః |
ఓం శీఘ్రకారిణే నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం జలోత్థితాయ నమః |
ఓం భవాత్మజాయ నమః | ౮౦
ఓం బ్రహ్మవిద్యాదిధారిణే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం సతతోత్థితాయ నమః |
ఓం విఘాతకారిణే నమః |
ఓం విశ్వదృశే నమః |
ఓం విశ్వరక్షాకృతే నమః |
ఓం భావగమ్యాయ నమః |
ఓం మంగళప్రదాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః | ౯౦
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః |
ఓం సత్యధర్మిణే నమః |
ఓం సఖ్యై నమః |
ఓం సరసాంబునిధయే నమః |
ఓం మోదకప్రియాయ నమః |
ఓం కాంతిమతే నమః |
ఓం ధృతిమతే నమః |
ఓం కామినే నమః |
ఓం కపిత్థఫలప్రియాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః | ౧౦౦
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం కళ్యాణగురవే నమః |
ఓం ఉన్మత్తవేషాయ నమః |
ఓం వరజితే నమః |
ఓం సమస్తజగదాధారాయ నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః |
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః | ౧౦౮

అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ||
నానావిధపత్రపుష్పాణి సమర్పయామి ||

ధూపం
దశాంగం దేవదేవేశ సుగంధం చ మనోహరం |
ధూపం దాస్యామి వరద గృహాణ త్వం గజాననా ||
శ్రీ మహాగణపతిం ధూపమాఘ్రాపయామి |

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం దీపం దర్శయామి |

నైవేద్యం
శాల్యన్నం షడ్రసోపేతం ఫల లడ్డుక మోదకాన్ |
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం స్వీకురు శాంకరే ||
శ్రీ మహాగణపతిం నైవేద్యం సమర్పయామి |

పానీయం పావనం శ్రేష్ఠం గంగాది సలిలాహృతం |
హస్త ప్రక్షాళనార్థం త్వం గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం హస్త ప్రక్షాళనం సమర్పయామి |

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |

నీరాజనం
నీరాజనం నీరజస్కన్ కర్పూరేణ కృతం మయా |
గృహాణ కరుణారాశే గజానన నమోఽస్తు తే||
శ్రీ మహాగణపతిం నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం
జాజీచంపక పున్నాగ మల్లికా వకుళదిభిః |
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణద్విరదాననా ||
శ్రీ మహాగణపతిం మంత్రపుష్పం సమర్పయామి |

(అవకాశమున్నవారు అనంతరము స్వర్ణపుష్పమును సమర్పించవలెను.)

ప్రదక్షిణం
యనికాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే ||

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయకా ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
శ్రీ మహాగణపతిం ప్రదక్షిణం సమర్పయామి |

నమస్కారం

నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్ట ప్రదోభూయా వినాయక నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన 

ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
శ్రీ మహాగణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి |

ఛత్రం 
స్వర్ణదండసమాయుక్తం ముక్తాజాలకమండితం |
శ్వేత పట్టాత పత్రం చ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం ఛత్రం సమర్పయామి |

చామరం –
హేమదండసమాయుక్తం గృహాణ గణనాయక |
చమరీవాలరజితం చామరం చామరార్చితా ||
ఉశీనిర్మితం దేవ వ్యజనం శ్వేదశాంతిదం
హిమతోయ సమాసిక్తం గృహాణ గణనాయక||
శ్రీ మహాగణపతిం చామరం వీజయామి |

శ్రీ మహాగణపతిం ఆందోళికార్థం అక్షతాన్ సమర్పయామి |
శ్రీ మహాగణపతిం సమస్త రాజోపచారాన్, దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం –
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధం పుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం సిద్ధి వినాయకనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

నమస్తే భిన్నదంతాయ నమస్తే వరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాశ్యామి గృహాణ గణనాయక ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

అనేన అర్ఘ్యప్రదానేన భగవాన్ సర్వాత్మకః సిద్ధివినాయకః ప్రియతాం |

అర్పణం 

యస్యస్మృత్యా చ నామోక్త్యా తవః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||

అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |