కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగ్రేటం చేసిన ఈఅమ్మడు అందం, అభినయంతో అనతికాలంలోనే కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. నేడు 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్న కియారా విశేషాలను తెలుసుకుందాం.

కాగా కియారా 8 వఏటనే ప్రకటనలో నటించింది. 1993 లో వచ్చిన పిల్లల బ్రాండ్ ప్రకటన వీడియోనూ కియారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఈ రత్నం దొరికింది! మా మమ్మీతో నా మొట్టమొదటి ప్రకటన! లవ్ యూ మా.. నీ వల్లనే ఈరోజు నేను ఇలా ఉన్నాను.. అంటూ క్యాప్షన్ తో వీడియోను పోస్ట్ చేసింది. కియారా వీడియోపై అభిమానులు ‘సో క్యూట్’.. ‘ఆరాధ్య’ అంటూ కామెంట్ చేశారు.


ఇక దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆచిత్రం తర్వాత మెషిన్, కళంక్ ,కబీర్ సింగ్,గుడ్ న్యూస్, లక్ష్మీ చిత్రాలలో నటించింది. ఇటు సినిమాలు వెబ్ సిరీస్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కియారా. అనంతరం మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో సీతగా అలరించింది.రెండు చిత్రాలు చేసినప్పటీకి తెలుగు అభిమానుల ప్రేమను గెలుచుకుంది.

కియారా తాజాగా నటించిన భూల్ భూలయ్యా 2.. జగ్‌జగ్ జీయో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. ఆమె నెక్స్ ప్రాజెక్టు విక్కీకౌశల్ తో కలిసి గోవింద నామ్ మేరా .. తెలుగులో రామ్ చరణ్ జోడిగా మరో చిత్రంలో నటిస్తోంది.