బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే: జె.పి.నడ్డా

Telanganaelections2023: తెలంగాణలో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే.. తోడు దొంగలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరేషన్.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి మేలు చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వంలో భారత దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి  తగు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భారత దేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరుగయ్యిందన్నారు. ప్రధాని మోదీ  నాయకత్వంలో భారత దేశం కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తోందని ..ఇదే ఉత్సాహం తెలంగాణలో కూడా ఉండాలనేది బీజేపీ ఆకాంక్షంగా ఆయన చెప్పుకొచ్చారు. సమాజంలో అధికంగా ఉన్న వర్గాలకు అధికారం దక్కాలని.. వారికి తగిన న్యాయం జరగాలని..బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులను గెలిపిస్తే కచ్చితంగా తెలంగాణ బంగారు మయం అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసే వాగ్దానాలు ఏవీ నిలిచేవి కావని.. బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఉమ్మడిగా తెలంగాణను దోచుకుంటారని హెచ్చరించారు. బీజేపీ నాయకత్వంలో తెలంగాణ సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు.బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమన్వయంతో అఖండ విజయం దిశగా పయనించాలని నడ్డా అభిప్రాయ పడ్డారు.

 

Optimized by Optimole