బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

2024లో విప‌క్షాల ఐక్య‌త‌పై ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అస్థిరమైనది.. సైద్ధాంతికంగా భిన్నమైనది కనుక “ఎప్పటికీ పనిచేయదు” అని ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త జోస్యం చెప్పారు. ఓజాతీయ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్ర‌శాంత్ కిశోర్ ఈవ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌న్హారం. ప్రతిపక్షాల ఐక్యత క్లిష్ట‌త‌ర‌మైన‌ద‌ని.. పార్టీలను నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మీడియాలో ప్రతిపక్ష కూటమి పార్టీలు, నాయకులు కలిసి రావడాన్ని చూస్తున్నామ‌ని.. ఎవరు ఎవరితో ఆత్మీయ‌స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.. వారి ఐక్య‌త‌ను భావజాల నిర్మాణంలో చూడాల‌ని సూచించారు. విప‌క్షాల‌ సైద్ధాంతిక పొత్తు జ‌రిగేదికాద‌ని,.. బీజేపీని ఓడించే అవకాశం లేదని ప్ర‌శాంత్ కిశోర్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

కాగా హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే సిద్ధాంతాల ప‌రంగా కూటమి ఉండాలన్నారు ప్ర‌శాంత్ కిశోర్‌. గాంధేయ‌వాది, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టుల.. భావజాలం చాలా ముఖ్యమైనది, కానీ భావజాలం ఆధారంగా గుడ్డి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదని హితువు ప‌లికారు. హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమవాదం..బీజేపీ మూల స్తంబాలని..వాటిలో కనీసం రెండిటినీ ఎదుర్కోవాలని విపక్షాలకు సవాల్ చేశారు. బ‌ల‌మైన పునాదుల‌పై నిర్మిత‌మైన బిజెపిని ఢీ కొట్టాలంటే..ముందుగా పార్టీ బలాలను బేరీజు వేసుకోవాలని పికే సూచించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌న్నారు ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త‌. ఆరునెలల పాటు జ‌రిగిన పాద‌యాత్ర‌కు ప్ర‌శంస‌లతో పాటు విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌న్నారు. పాద‌యాత్ర త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో తేడాను గ‌మ‌నించాల‌ని పీకే సూచించారు.

ఇదిలా ఉంటే బీహార‌లో చేప‌ట్టిన “జన్ సూరాజ్ యాత్ర గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు పీకే. పాద‌యాత్ర ముఖ్య ఉద్దేశ్యం మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని పునరుద్ధరించడ‌మని తేల్చిచెప్పారు. బీహార్ కులపరమైన రాజకీయాలకు పెట్టిందిపేర‌ని.. కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించేందుకు ప్రయత్నంగా పాద‌యాత్ర‌ను చేపట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌న పాద‌యాత్ర కేవలం నాలుగు జిల్లాలను మాత్రమే కవర్ చేయగలిగిందని.. పాద‌యాత్ర మిషన్ కాదని..ప్రాంతాన్ని అర్థం చేసుకునే స్వ‌భావమ‌ని పీకే స్ప‌ష్టం చేశారు.

Optimized by Optimole