సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్..!
శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు….