ఉగాది పండగ విశిష్టత..!!
ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయం కలిస్తే ఒక సంవత్సరం గా భావిస్తాం. ‘ఉ’ అంటే నక్షత్రమని , ‘గ’ అంటే గమనమని.. దీన్ని ఈరోజు నుంచి లెక్కిస్తారని శాస్రం చెబుతున్నది. మొదటి సంవత్సరం, ఋతువు, మాసం, తిథి అయిన పాడ్యమిని మొదటి రోజుగా ఉగాదిని జరుపుకుంటాం. పురాణ కథ: సూదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడని చెబుతారు. ఆసమయంలో అమ్మవారు…