తిరుచందూర్ “సుబ్రహ్మణ్యస్వామి “..!
సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. స్థలపురాణం: తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి…