ఎమ్మెల్సీకవిత: మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు పెట్టాలి
Hyderabad: మామునూరు విమానాశ్రయానికి కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రుద్రమదేవి లాంటి వీరనారిని గౌరవించాలంటే విమానాశ్రయానికి ఆమె పేరును తప్పక పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత, ‘‘తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదు. అందుకే రాహుల్ గాంధీని వరంగల్‌కు తీసుకువచ్చి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో…
