ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు వైసీపీ చీకటి జీవోను తీసుకొచ్చింది: పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య…