దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. కొత్తగా వెయ్యి 270 మందికి వైరస్​ సోకింది. 31 మంది మహామ్మరితో మరణించారు. అటు వెయ్యి 567 మంది కరోనా నుంచి కోలుకున్నారు . మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 4 లక్షల 20 వేల 842 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,26,35,673 కు…

Read More

ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…

Read More

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో ముగిసిన భారత్ కథ..!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి. అంతకముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభానిచ్చారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన షెఫాలీ, అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఆ…

Read More

నల్గొండ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మెగా పవర్ స్టార్’ జన్మదిన వేడుకలు!

నల్గొండ జిల్లా కేంద్రంలోని చారుమతి చైల్డ్ కేర్ లో ఆదివారం ‘ మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షుడు అలుగు బెల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభివృద్ధి కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని.. మేమే సైతం మా వంతు కృషిగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం అనాధ బాలలకు ఒకరోజు సరిపడా బియ్యం, పండ్లు, స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జిల్లా…

Read More

చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50)…

Read More

ధోని షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ డెసిషన్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మరో రెండు రోజుల్లో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు.. సీఎస్కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి ధోని స్థానంలో.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యత నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది. ధోని నిర్ణయంతో.. సీఎస్కే అభిమానులతో పాటు…

Read More

అట్టహాసంగా పద్మ అవార్డులు ప్రధానోత్సవం!

రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..54 మంది గ్రహీతలకు పద్మ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో ప్రముఖ యోగా గురువు స్వామి శివానందతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇక పద్మ అవార్డులు ప్రదానోత్సవంలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దర్బార్ హాల్లో యోగా గురు స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి…

Read More

‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది….

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు..!

తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు? అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా…

Read More

‘దంగల్ ‘ రికార్డ్ బ్రేక్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ..

1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన…

Read More
Optimized by Optimole