దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!
భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అటు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న…