భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3…

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది….

Read More

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ విడుదల!

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ లిరికల్ నూ చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా పాట…

Read More

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….

Read More

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read More

యూపీ లో జికా వైరస్ కలకలం..!

యూపీ కాన్పుర్​లో జికా వైరస్ ​వ్యాప్తి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు.

Read More

అల్లు అర్జున్ కు షాకిచ్చిన సజ్జనార్!

టిఎస్ఆర్టీసిని కించపరిచే విధంగా ప్రకటనలో నటించిందుకు హీరో అల్లు అర్జున్‌కు, ర్యాపిడో సంస్థ‌కు లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్లు తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆర్టీసీ బ‌స్సుల‌ను దోసెల‌తో పోల్చారని.. దీంతో ప్ర‌యాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయన్నారు. ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్ర‌తికూలంగా చూపించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఆర్టీసీని కించ‌ప‌రిస్తే సంస్థ‌, ఉద్యోగులు, ప్ర‌యాణికులు స‌హించ‌రని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవ‌లో ఉందన్న సజ్జనార్.. ప్ర‌జా ర‌వాణాను ప్రోత్స‌హించే…

Read More

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. సాధారణ బియ్యాన్ని దశల వారీగా కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.సీఎం కేసిఆర్ ధాన్యం, బియ్యం విషయంలో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువుగా బియ్యం కొంటుందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని.. కేరళలోనూ వాడకం తగ్గినందున్న అబియ్యాన్ని కొనలేమని…

Read More

డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని ముందే చెప్పిన ఫడ్నవీస్.. అనుకున్నట్టే మాలిక్‌కు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దావూద్ అనుచరుల నుంచి మాలిక్ చౌకగా ఆస్తులు కొన్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో…

Read More

టిఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేతలు!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ గేర్ మార్చింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాక వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తాజా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమేనని… త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. మోదీ అశీర్వాదంతో…

Read More
Optimized by Optimole