ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం..

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను…

Read More

టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!

తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌సిద్ధి చెందిన‌ రాజ‌బాబు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నా ఆయ‌న గ‌త రాత్రి మృతి చెందారు. 64 సంవ‌త్స‌రాల రాజ‌బాబు 62 సినిమాల్లో న‌టించి మంచి పేరు పొందారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజ‌బాబు స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లంలోని న‌ర‌స‌రావుపేట‌. చిన్న‌ట‌ప్ప‌టి నుంచే న‌ట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న ఆయ‌న దేశ‌వ్యాప్తంగా నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. 1995లో ఊరికి మొన‌గాడు సినిమాతో…

Read More

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు. కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు….

Read More

ఉద్యోగాల్లో పురుషులతోపాటు స్త్రీలకు అవకాశం కల్పించాలి: మోడీ

ప్రభుత్వ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనన్న భావన ఇక ఎంత మాత్రం పనికిరాదన్నారు ప్రధాని మోదీ . తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో బలగాల్లో మహిళల సంఖ్య రెట్టింపయిందని అన్నారు. ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. 2014లో తాను పగ్గాలు చేపట్టినప్పుడు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్య 1.05 లక్షలు ఉండేదని.. ప్రస్తుతం అది 2.15 లక్షలకు చేరిందని తెలిపారు. భవిష్యత్‌లో కొత్త తరం పోలీసింగ్‌కు వారే సారథులవుతారన్న ప్రధాని…

Read More

ఓటిటిలో శ్రీ దేవీ సోడా సెంటర్..!

‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ లో అభిమానులను అలరించనుంది. నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ…

Read More

భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.ప్రాచీన సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.భాషను మరిచిపోతే తెలుగు సంస్కృతి కూడా దూరమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని…

Read More

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే…

Read More
Optimized by Optimole