Haryana: హర్యానా బరిలో కాంగ్రెస్ జోరును.. బీజేపీ ఆపేనా..?
Haryanaelections2024: హర్యానా చిత్రం స్పష్టమౌతోంది. ఒకే విడతలో ఈ శనివారం పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ ఎన్నిక, అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్ మధ్య దాదాపు ముఖాముఖి పోటీగానే తయారయింది. చిన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగులనుంది. గత మే నెల్లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికే స్వల్ప ఆధిక్యత సాధించిన కాంగ్రెస్… ఆ పట్టు సడలనీకుండా పురోగమిస్తోంది. ఆధిక్యతా స్పష్టమౌతోంది. పదేళ్ల వరుస పాలన వల్ల ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పలు అంశాలు…