‘జగనన్న పాపం పథకం’తో పోలవరం ప్రాజెక్టుకి శాపం: జనసేన నాదెండ్ల మనోహర్
APpolitics: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్…