Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెల‌గాటం : ఎస్ఎఫ్ఐ

Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంద‌ని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్య‌క్షులు చరణ్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విద్యాసంస్థల బంద్ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ‌ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాల‌వ‌డం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు ప‌ట్టింపులేన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం సిగ్గుచేట‌న్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ త‌క్ష‌ణ‌మే విచార‌ణకు…

Read More

INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!

INC: ‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి….

Read More

MLC2024: ఎమ్మెల్సీ టికెట్ దక్కేదెవరికి .?

MLCElections2024: ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్థులు..ఆశావహులు ప్రచారాన్ని మొదలెట్టారు. రోజువారీగా వివిధ కార్యక్రమాల పేరిట ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమంగా సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించడంలోనిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరునూరైనా సరే బలమైన అభ్యర్థిని రంగంలో నిలిపి గెలిచి తీరాలని దృడ నిశ్చయంతో కనిపిస్తోంది. టికెట్ కోసం మంత్రుల లాబీయింగ్.. కరీంనగర్,…

Read More

Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!

• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన •  నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్  • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో  పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే…

Read More

BJPtelangana: తెలంగాణ బీజేపీ నిద్రమేల్కొనేనా..?

BJPTELANGANA: ఆచార్య చాణక్యుడి రాజనీతి శాస్త్ర ప్రకారం ఏ వ్యవస్థలో అయినా విజయవంతం కావాలంటే కచ్చితంగా క్రమశిక్షణతో పాటు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే లక్షణాలు కలిగుండాలి. ఈ రాజనీతి సూత్రాన్ని ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నా, సరైన మార్గదర్శం లేక అంతర్గత కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికలతో బీజేపీ అధిష్టానం బిజీగా ఉండడంతో తెలంగాణపై…

Read More

MaharashtraexitPoll: ‘మహాయుతి’కి జైకొట్టిన మహారాష్ట్ర: పీపుల్స్ పల్స్

Maharashtra exit Poll2024:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్,…

Read More

JharkhandexitPoll: జార్ఖండ్ లో ఎన్డీఏ జయకేతనం : పీపుల్స్ పల్స్

Jharkhand exit Poll 2024:ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో…

Read More

Indira Gandhi: మంత్రగత్తెను రాళ్లతో కొట్టి చంపినట్టే.. ఇందిరను బులెట్లతో నింపారు..!

Nancharaiah merugumala senior journalist: మంత్రగత్తె ముద్రేసి రాళ్లతో కొట్టి చంపినట్టే ఢిల్లీలో ప్రధాని ఇందిరను 40 ఏళ్ల క్రితం బులెట్లతో నింపారు ప్రథమ భారత ప్రధాని ఏకైక బిడ్డ ఇందిరాగాంధీ 1966 శీతాకాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే నాటికి పదేళ్ల నిండడానికి దగ్గర్లో ఉన్న మా తరం తెలుగోళ్లు చాలా మందికి ఆమె ఇప్పటికీ చిక్కుముడిగానే కనిపిస్తోంది. 1971 లోక్‌సభ ఎన్నికల నాటికి టీనేజీ పిల్లలమైన మాకు అప్పుడు ఇందిరాగాంధీ గెలవాలని అనిపించింది. నాలుగేళ్ల తర్వాత…

Read More

Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం

Atmakur:  ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న  సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…

Read More

IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read More
Optimized by Optimole