ఉత్తరాంధ్రలో యువ నాయకత్వం అవసరముంది: నాదెండ్ల
ఉత్తరాంధ్ర రెండు కుటుంబాల సొత్తు కాదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇక్కడి యువ నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలు, వ్యక్తులు తొక్కిపట్టి పెత్తనం చెలాయించారని తెలిపారు. సహజ సంపద దోపిడీ చేసి..కావాలనే యువ నాయకత్వాన్ని చంపేశారన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవస్థలో యువ నాయకత్వం అవసరముందన్నారు. సమస్యలపై పోరాడే గుణం, ధైర్యంగా గలమైతే.. ప్రతి సమస్య మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న యువ నాయకులకు ఇక్కడ కొదవ లేదని.. అలాంటి నాయకత్వం వెలికి తీయడమే జనసేన పార్టీ…
