Telangana: జాగృతి కమిటీలతో కవిత జోరు..!
తెలంగాణా: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె..సభకి సంబంధించి తండ్రి కేసిఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఇండైరెక్టుగా కేటీఆర్, సంతోష్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ మార్పుపై అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ… ప్రజల్లో తీవ్ర చర్చ రేకెత్తింది. కవిత సొంతగా పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందంటూ ఊహాగానాలు…
