Budget2025: బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం బడ్జెట్ : సరిత తిరుపతయ్య

Gadwal: కేంద్ర బడ్జెట్ పై జెడ్పి మాజీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఘాటుగా స్పందించారు.బీహార్ ఎన్నికల కోసమే అనేలా కేంద్రం బడ్జెట్ ఉందన్న ఆమె.. వరుసగా 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు మహిళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్ష చూపడం బాధాకరమని ఆవేదన…

Read More

MLCElections: గురు దేవో భవ..!

VasanthaPanchami: ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి అంటే… మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ సరస్వతీ మాతను పూజించే పండుగ. అంటే, మన విద్యావ్యవస్థకు ప్రాణం పోసే గురువుల గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగ కూడా! “గురు బ్రహ్మ, గురు విష్ణు” అని మొదలుపెట్టి, ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’’ అని మన విద్యార్థులు సదా స్మరించే శ్లోకమే దీనికి నిదర్శనం! జ్ఞానమాతను పూజించే ఈ రోజున, జ్ఞానదాతలైన…

Read More

Telangana: పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ..!

Telangana: రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే బలమైన ఆర్థిక పునాదులుండాలనే దృఢమైన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెండడమే కాకుండా ప్రధానంగా ఉపాధి రంగం కూడా మెరుగుపడే అవకాశాలుండడంతో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతున్నాయి. తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్గా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటీ సఫలీకృతం కావడం అభినందనీయం. ఇప్పటికే అన్ని రంగాలను ఆకర్షిస్తున్న…

Read More

socialmedia: అమ్మాయిలు – అబ్బాయిలు సోషల్ మీడియాతో జాగ్రత్త..!

విశీ: DISCLAIMER: ఇది మీడియా కథనాల ఆధారంగా, మరికొంత తెలుసుకున్న సమాచారంతో రాసింది. యథార్థం ఇదే అన్న నిర్ధారణ ఇందులో లేదు. కేవలం ఒక అవగాహన, హెచ్చరిక కోసమే రాస్తున్న కథనం ఇది. గమనించగలరు. ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆదిలాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెది అదే పట్టణం కావడంతో రోజూ కాలేజీకి వెళ్తూ, వస్తూ ఉంది. ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. తన చేతిలో కూడా ఉంది. అందరికీ సోషల్‌మీడియా అకౌంట్లు ఉంటున్నాయి. తనకీ…

Read More
bjp telangana,bjp,

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు…. పార్టీలో కొత్తగా చేరే వారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద…

Read More

BJPtelangana: కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్: బోయినపల్లి ప్రవీణ్

Karimnagar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు రూ .12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల…

Read More

INCTelangana: ఎవుసానికి కాంగ్రెస్ భరోసా..!

Telangana: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============== నూతన సంవత్సరం తొలివారంలోనే శుభవార్త విన్న తెలంగాణ రైతన్నలకు పది రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ అన్నదాతలకు మరింత భరోసా కల్పిస్తూ ‘రైతు భరోసా’ను ప్రకటించి మాది ‘రైతు ప్రభుత్వం’ అని మరోసారి నిరూపించుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘రైతు రుణమాఫీ’ ‘వరికి బోనస్’ పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు…

Read More

Telangana: బీసీలకు కాంగ్రెస్ భరోసా..!

INCTELANGANA: -బి.మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ======================= కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలనలో రాష్ట్రానికి వెన్నెముక లాంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతివ్వడం గర్వంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది. మొదటి ఏడాది పాలనలో ప్రభుత్వం బీసీల్లో భరోసా నింపడంతోపాటు, వారికి రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించేలా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది….

Read More

RevanthReddy: పార్టీకి ఎజెండా సెట్ చేసిన సీఎం..!

INCTELANGANA: ‘తనదాకా వస్తే కాని తత్వం బోధపడదం’టారు. ఆ గ్రహింపు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించడమే కాదు అందరికీ నొక్కిచెప్పారు. ఏమైతేనేం, ఏడాది పాలన దాటాక ఆయన నోరు విప్పారు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పని నాలుగు మంచి మాటల్ని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కొందర్ని కూర్చోబెట్టుకొని చెబుతూ, వారి ద్వారా సమస్త కాంగ్రెస్ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు….

Read More

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More
Optimized by Optimole