Telangana
ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా : మంత్రి జగదీష్
సూర్యాపేట: తెలంగాణా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ క్యాలెండర్ ను ఆయన శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో దోహదపడుతుందన్నారు జగదీష్ రెడ్డి.సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ఫార్మర్స్ ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల…
విలువలెరిగిన తండ్రి..
చదువు ఎంత ముఖ్యమో తెలిసిన ఒక తండ్రి. ఆ చదువు కూడా ఏ ఉన్నత ప్రమాణాలతో ఉండాలో తెలిసి, అందుకు సిద్దపడ్డ సాహసి! రాజస్థాన్ రాజధాని జైపూర్ లో, రాజకుటుంబీకులు, ఇతర సంపన్నుల పిల్లలు చదువుకునే (సెయింట్ గ్జేవియర్ అనుకుంటా, పేరు సరిగా గుర్తులేదు) కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు తన కొడుకుని. జోద్పూర్ ప్రాంతంలో రెవెన్యూలో ఓ సాధారణ ఉద్యోగిగా తనకొచ్చే 60 రూపాయల నెల జీతంలో, 50 రూపాయల నెలసరి ఫీజు కట్టి కాన్వెంట్ స్కూల్లో…
అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్
దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని మోడీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.సీఎం చేతగానితనంవల్లే అప్పలు కుప్పగా రాష్ట్రం మారిందని వాపోయారు.ఆంధ్రోళ్లను రాక్షసులుగా..పెండ బిర్యానీగాళ్లుగా కించపర్చిన కేసీఆర్ ఇప్పుడే ఏం సమాధానం చెబుతారని? సంజయ్ ప్రశ్నించారు. కాగా నాగర్ కర్నూలు…
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ ..!!
సూర్యాపేట: సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతే మండలం మామిల్లగూడెం వద్ద కారును .. బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిది ఖమ్మం జిల్లా అని సమాచారం. వారంతా హైద్రాబాద్ నుంచి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు . కేసు నమోదు…
పేరుతో కాదు..‘ఫేమ్’తోనే పని !
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….
తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..
సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్ అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్ పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్ విమర్శించారు. అటు…
ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్ ….
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…
యాదాద్రిలో భారీ స్వాగత తోరణం..
యాదాద్రిలో భారీ తోరణం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. పంచనారసింహుల ఆలయ వైభవానికి అనుగుణంగా భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానున్నట్లు సమాచారం. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య 40 అడుగుల ఎత్తు.. 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణానికి అధికారులు రూపకల్పన చేశారు.స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య విమాన రథోత్సవం సాదృశ్యమయ్యేలా ఐరావతం, తీర్ధజనుల దృశ్యాలను తోరణంలో తీర్చిదిద్దారు….