ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!
ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…