సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్ అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్ పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్ విమర్శించారు.
అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం.. హైకోర్టు తీర్పును స్వాగతించారు. CS సోమేష్ కుమార్ నియామకం..ముందు నుంచి అక్రమమనే విషయాన్ని తాము చెబుతూనే ఉన్నామని.. ఇప్పుడు కోర్టు తీర్పు అదే విషయాన్ని రుజువుచేసిందని అన్నారు. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకుని సోమేష్ కుమార్ ను సీఎస్ గా తప్పించి…. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.